![]() |
![]() |
.webp)
ఫామిలీ స్టార్స్ సీజన్ 2 గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది. 26 నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 7.30 కి ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ఈ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఇక సుధీర్ హోస్ట్ గా వచ్చేసాడు. పక్కన మరదళ్ళుగా అష్షు రెడ్డి, స్రవంతి చొక్కారావు వచ్చేసారు. హీరోయిన్ సీరత్ కపూర్ కూడా ఈ ప్రోమోలో కనిపించింది. అలాగే రాము రాథోడ్, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, నిఖిల్ మెళియక్కాల్, తేజస్విని గౌడ, యష్మి , సింగర్ ధనుంజయ్, ప్లే బ్యాక్ సింగర్ భార్గవి పిళ్ళై, నూకరాజు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా, పంచ్ ప్రసాద్ వంటి వాళ్లంతా కనిపించారు.
నూకరాజు హీరోయిన్ సీరత్ కపూర్ కి మేకప్ ఆర్టిస్ట్ గా వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. "నువ్వెవరు " అని సుధీర్ అడిగేసరికి "మేడం అసిస్టెంట్ " అన్నాడు నూకరాజు. "ఎంతిస్తున్నారు " అన్నాడు. "అస్సలు చెప్పను ఏ నువ్వు వచ్చేద్దామనా " అన్నాడు. "మీలాంటి అమ్మాయి దొరుకుద్ది అంటే జీవితాంతం రన్ చేయొచ్చండి " అన్నాడు సుధీర్. వెంటనే నూకరాజు సుధీర్ ముఖంమీదకు అద్దం పెట్టి నీ మొహం చూసుకుని చెప్పు డైలాగ్ అప్పుడప్పుడు అంటూ కౌంటర్ వేసాడు.
ఇక మరింత రెచ్చిపోయి "ఏమే అష్షు..." అన్నాడు. "ఏమేనా..." అంది అష్షు. "మేడంని ఏమన్నా అనే అధికారం నాకే ఉంది. " అన్నాడు నూకరాజు. "అంత రైట్స్ నీకు ఎలా వచ్చాయి. " అన్నాడు సుధీర్. "399 రూపాయలు పెట్టి కొన్నాను తెలుసా " అన్నాడు నూకరాజు. దాంతో అందరూ నవ్వేశారు. ఇక అష్షు రెడ్డి ఐతే రెండు చేతుల్లో ముఖం దాచుకుంది.
![]() |
![]() |